- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొంగుముడికి కోట్లు ఖర్చు.. ఏజెన్సీలో శీనన్న బిడ్డ పెళ్లి పై చర్చ
దిశ, గుండాల: ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహం

దిశ, గుండాల: ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 12వ తేదీన అమెరికాలో జరుగునుంది. అలాగే రిసెప్షన్ ఈ నెల 17వ తేదీ ఖమ్మంలో భారీగా అంగు ఆర్భాటంతో జరుగుతుందని తెలియడంతో ఏజెన్సీ ప్రాంతంలో శీనన్న బిడ్డ పెండ్లి చర్చనీయంగా మారింది. 90 ఎకరాల సువిశాలమైన స్థలంలో మూడు లక్షల మందికి భోజనాలు, ఒకేసారి 30 వేల మంది భోజనం చేసే విధంగా ఏర్పాటు చేశారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దీంతో ఎలాగైనా ఈ రిసెప్షన్‌కి వేడుకకు వెళ్లి తీరాలనే తపన ఏజెన్సీ ప్రాంత ప్రజల్లో నెలకొంది. ఎన్ని పనులు ఉన్నా పక్కకు పెట్టి శీనన్న రిసెప్షన్‌కి వెళ్ళాలని ప్రజలు బావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఇప్పటికే గుండాల ఆళ్లపల్లి మండలాల్లో శీనన్న వివాహ వాచీలు, పెళ్లి పత్రికలు ఇంటింటికి ఇవ్వడం పూర్తయింది.






