- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డైనిమిక్ లాంటి పత్రిక దిశ : మంత్రి పొంగులేటి
దిశ, తల్లాడ : జర్నలిజంలో డైనమిక్ లాంటి పత్రిక దిశ పత్రిక అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, తల్లాడ : జర్నలిజంలో డైనమిక్ లాంటి పత్రిక దిశ పత్రిక అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పత్రిక ప్రారంభమైన అనాధ కాలంలోనే లక్షలాది మంది పాఠకుల అభిమానాన్ని పొందిన పత్రిక దిశ పత్రిక అని కొనియాడారు.దిశ దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ను ఆయన బుధవారం స్వగృహమైన కల్లూరు మండలంలోని నారాయణపురం గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు,సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి పక్షపాతం లేకుండా వార్తలు రాయడంలో దిశ పత్రిక నైజమైనదని. మీడియా రంగంలో నూతన వరవడికి నాంది పలుకుతూ నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో దిశ పత్రిక అని.క్షణం క్షణంలో ఏం జరిగినా పాఠకులకు ముందు వార్తలు తెలియజేయడంలో "దిశ"పత్రిక ముందు వరుసలో ఉందన్నారు. ప్రతిరోజు ఉదయం పత్రికను చదవకుండా ఉండలేని పరిస్థితి పాటకులకు కల్పించింది అన్నారు. ఎప్పటి వార్తలప్పుడు అందరికీ అందించేందుకు డైనమిక్ ఎడిషన్స్ కూడా అందుబాటులో తీసుకురావడం అభినీయనందనం.రాబోయే రోజుల్లో ముందు వరుసలో ఉండాలి అంటూ ముందుగా దిశ పత్రిక యాజమాన్యానికి సత్తుపల్లి నియోజవర్గ జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం దిశపత్రిక జర్నలిస్టులు అనిల్ కుమార్,రుద్రాక్ష నరసింహచారి,జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.






