నా మాటే శాసనం! డిప్యూటీ డీఎంహెచ్ చేష్టలతో వైద్యులకు ఇబ్బందులు

by Ajay Maddhiboyina |

ఖమ్మం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వింత పోకడలపై దిశ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అతడి చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో పనిచేసే డాక్టర్లు, సిబ్బందితో ‘నా మాట వినకపోతే బుల్లెట్ దిగుద్ది. నేను పెన్ను పెడితే మీ ఉద్యోగాలు పోతాయి’ అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ తన దారికు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తున్నది.

నా మాటే శాసనం! డిప్యూటీ డీఎంహెచ్ చేష్టలతో వైద్యులకు ఇబ్బందులు
X

ఖమ్మం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వింత పోకడలపై దిశ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అతడి చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో పనిచేసే డాక్టర్లు, సిబ్బందితో ‘నా మాట వినకపోతే బుల్లెట్ దిగుద్ది. నేను పెన్ను పెడితే మీ ఉద్యోగాలు పోతాయి’ అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ తన దారికు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఎమర్జెన్సీలో లీవ్ ఇవ్వాలంటే నా మాట వింటే లీవ్ మంజూరు అవుతుందని హుకుం జారీ చేస్తున్నాడని సమాచారం. ప్రైమరీ హెల్త్ సెంటర్లు విజిట్ చేసిన ప్రతీ సారి అక్కడ మెడికల్ ఆఫీసర్ కంపల్సరిగా శాలువాలతో సన్మానించాల్సిందే. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రోగ్రాములపై దృష్టిసారించకుండా ఇతర కార్యక్రమాలు చేస్తూ మెడికల్ ఆఫీసర్లను నానా ఇబ్బందులు పెడుతుంటారనే ఆరోపణలు ఉన్నాయి. - దిశ, ఖమ్మం

దిశ, ఖమ్మం: ఖమ్మం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రవర్తన విమర్శలకు దారితీస్తోంది. వైద్యారోగ్యశాఖ పలు ప్రోగ్రాములు నడుస్తుంటాయి. దీంతో పాటు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేసే వైద్యులకు సూచనలు చేస్తూ ముందుకు తీసుకెళ్లే డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వింత పోకడలతో డాక్టర్లు, సిబ్బంది మానసికంగా ఒత్తిడి గురవుతున్నారు. ప్రోగ్రాములో ఉండే కార్యక్రమాలు చేయకుండా తాను ఇష్టం వచ్చినట్టు ఆదేశాలిస్తూ వైద్యులను క్షేత్రస్థాయిలో పనిచేయకుండా సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఖమ్మం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో వ్యవహార శైలిపై దిశ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనం పై వివిధ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసే డాక్టర్లు సిబ్బంది దిశ దినపత్రిక కవరేజీ ప్రశంసించారు. గత కొన్ని రోజులుగా డిప్యూటీ డీఎంహెచ్‌వో వ్యవహార శైలితో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ తెలిపారు. ప్రభుత్వం తరఫున ఉండే వివిధ ప్రోగ్రాముల్లో చేరకుండా సూటి మాటలతో ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది నా మాట వినకపోతే బుల్లెట్ దిగుద్ది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్టు తెలిపారు. నా మాట వినకపోతే నేను పెన్ను పెడితే మీ ఉద్యోగాలు పోతాయి అంటూ ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేస్తూ తన దారికు తెచ్చుకుంటున్నాడు.

లీవ్ ఇవ్వాలంటే..

ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేసే వైద్యులకు, సిబ్బందికి ఎమర్జెన్సీలో లీవ్ ఇవ్వాలంటే నా మాట వింటే లీవ్ మంజూరు అవుతుందని హుకుం జారీ చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేసే వైద్యురాలికి వెటర్నటి లీవ్ కావాలని అడిగింది. వెంటనే ఆఫిస్ రాండి అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో పనిచేసే వైద్యులు, అసలు రూల్ ప్రకారం సిబ్బందికి సెలవు కావాలంటే ముందుగా డ్రాయింగ్ ఆఫీసర్ సంప్రదించాలి, డ్రాయింగ్ ఆఫీసర్ లీవ్ మంజూరు చేస్తే ఆ దరఖాస్తు డిప్యూటీ డీఎంహెచ్‌వో అధికారికి పంపిస్తారు అతను సంతకం పెట్టి డీఎంహెచ్‌వో దృష్టిలో పెడతారు. అలాంటిది ఏమీ లేకుండా అతనే సంతకం పెట్టి దరఖాస్తు ఫైనల్ చేస్తాడు. కొన్ని దరఖాస్తులు డ్రాయింగ్ ఆఫీసర్ సంతకం లేకపోవడంతో అలాగే పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది. దాంతోపాటు డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఉండే ముఖ్యమైన ఫైల్స్‌ను అతను బ్యాగులో పెట్టుకొని ఇంటికి తీసుకోవడం గమనార్హం.

శాలువాలతో సన్మానించాల్సిందే..

ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కంట్రోల్లో ఉంది. ఇతను ఆయా ప్రైమరీ హెల్త్ సెంటర్ పోయినప్పుడు అక్కడ మెడికల్ ఆఫీసర్ ఇతన్ని కంపల్సరిగా శాలువాలతో సన్మానించాలి.. సన్మానించిన ఫొటోను మెడికల్ ఆఫీసర్ స్టేటస్‌లో పెట్టాలి. ఇతను తనిఖీ చేపట్టినప్పుడు మెడికల్ ఆఫీసర్ అతని మాట వినకపోతే సిబ్బంది ముందే మెడికల్ ఆఫీసర్‌పై విరుచుకుపడతాడు. మెడికల్ ఆఫీసర్‌కు ఇచ్చే గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రోగ్రాములపై దృష్టి పెట్టకుండా ఇతర కార్యక్రమాలు చేస్తూ మెడికల్ ఆఫీసర్లను నానా ఇబ్బందులు పెడుతుంటారనే ఆరోపణలు ఉన్నాయి.

దిశ కథనంతో

దిశ దినపత్రికలో శనివారం డీఎంహెచ్ఓలో ఓ అధికారి వింత పోకడ అంటూ కథనం ప్రచురించిన విషయం విదితమే. ఈ కథనంతో కొంతమంది వైద్యులు, సిబ్బంది దిశ దినపత్రిక యాజమాన్యానికి, బ్యూరోకు ప్రశంసలు కురిపించారు. అతడి ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా కరెక్ట్‌గా రాశారని కొనియాడారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇలాంటి అధికారులను ఇప్పటి వరకు చూడలేదు అంటూ చెప్పుకొచ్చారు. డబుల్ మీనింగ్ మాటలు, సూటి పోటి మాటలతో మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఇలాంటి అధికారిపై డీఎంహెచ్ఓ పెదవి విప్పడం లేదు. పలు అనుమానాలకు తావిస్తోంది. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వ్యవహార శైలిపై జిల్లా అధికారి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Next Story