అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా.. జమలాపురంలో భట్టీ కీలక వ్యాఖ్యలు

by Geesa Chandu |

గత 10 ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలు లేక, రాష్ట్రంలో చాలా చోట్ల అభివృద్ధి కుంటుపడిందని.. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క వెల్లడించారు.

అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా.. జమలాపురంలో భట్టీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: గత 10 ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలు లేక, రాష్ట్రంలో చాలా చోట్ల అభివృద్ధి కుంటుపడిందని.. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క వెల్లడించారు. ఎర్రుపాలెం మండలం జమలాపురంలో భట్టీ మాట్లాడుతూ.. "జమలాపురాన్ని రాష్ట్రానికి ఒక మంచి పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళికను తాము సిద్ధం చేశామని తెలిపారు. ఎనిద్రం చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, ప్రపంచ టూరిస్టులు జమలాపురం లో గడిపేలా ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేశామని అన్నారు. గత పాలకుల అలసత్వం వల్ల ఇక్కడ అభివృద్ధి జరగలేదు. త్వరలో ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేయబోతున్నట్లు భట్టీ అన్నారు. జమలాపురం చెరువుకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి అధికారికంగా తూము ఏర్పాటు చేపించి, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మారుస్తామని తెలిపారు. ఎరుపాలెం మండలాన్ని సాగర్ మూడవ జోన్ నుంచి రెండవ జోన్ లోకి మారుస్తామని, దీని వల్ల మండలంలో ఎక్కడ కూడా తాగు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని, దీనికి సంబంధించిన సర్వేలు, మ్యాపులను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదలవుతుందని అన్నారు. కాగా బడ్జెట్లో అవసరమైన నిధులు ఇప్పటికే కేటాయించామని" భట్టీ విక్రమార్క వెల్లడించారు.

Next Story