- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయాళ్ సేవలు మరువలేనివి- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ గా ప్రస్థానం ప్రారంభించి ప్రధానోపాధ్యాయులుగా మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూనే దేశంలోనే మొట్టమొదటి గిరిజన బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ గా కూడా వ్యవహరించి తానే అభివృద్ధికి అహర్నిశలో కృషి చేసి కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారిగా గత ఆగస్టులో రిటైర్ అయిన శ్రీరామ్ విద్య ప్రాంగానికి చేసిన సేవలు మరువలేనివని భావితరాల వారు ఆ సేవలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

దిశ, కొత్తగూడెం: విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ గా ప్రస్థానం ప్రారంభించి ప్రధానోపాధ్యాయులుగా మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూనే దేశంలోనే మొట్టమొదటి గిరిజన బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ గా కూడా వ్యవహరించి తానే అభివృద్ధికి అహర్నిశలో కృషి చేసి కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారిగా గత ఆగస్టులో రిటైర్ అయిన శ్రీరామ్ విద్య ప్రాంగానికి చేసిన సేవలు మరువలేనివని భావితరాల వారు ఆ సేవలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి యోగితా రానా ప్రభుదయాలను ప్రత్యేకంగా అభినందిస్తూ పంపిన ప్రశంసా పత్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈరోజు కలెక్టరేట్లో జరిగిన ఒక కార్యక్రమంలో అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖలో మరువలేని సేవలు అందించి ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులను ఉన్నతలగా తీర్చిదిద్ది వారికి సరైన మార్గదర్శకత్వం వహించిన వీరి సేవలను అందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. తదుపరి రాష్ట్ర విద్యాశాఖ వారు ప్రతినెల రిటైర్ అయ్యేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు పంపే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈ నెలలో పదవీ విరమణ పొందబోతున్న ఏడుగురు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ పంపిన ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి . నాగలక్ష్మి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజ శేఖర్, సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.






