- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదకరంగా స్మశానవాటిక రహదారి
ఇసుక ట్రాక్టర్ల వలన స్మశానవాటికకు వెళ్లే మట్టి రోడ్డు ప్రమాదకరంగా మారిందని సోమవారం ఇసుక ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకొని నిరసన తెలిపారు.

ప్రమాదకరంగా స్మశానవాటిక రహదారి
ఇసుక ట్రాక్టర్ల వల్లే ధ్వంసమైన మట్టి రోడ్డు
అంతిమ సంస్కారాల సమయంలో ఇబ్బందులు
ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన తెలిపిన సాటివారిగూడెం గ్రామస్తులు
రోడ్డును బాగు చేయాలని ప్రభుత్వానికి వేడుకోలు
దిశ, కొత్తగూడెం: ఇసుక ట్రాక్టర్ల వలన స్మశానవాటికకు వెళ్లే మట్టి రోడ్డు ప్రమాదకరంగా మారిందని సోమవారం ఇసుక ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకొని నిరసన తెలిపారు. లక్ష్మిదేవి పల్లి మండలం, సాటివారిగూడెం గ్రామ పంచాయతీ సాటివారిగూడెం గ్రామంలో ప్రభుత్వ ఇసుక ర్యాంప్ నుండి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు అధికంగా తిరగడంతో మట్టి రోడ్డు గుంతల మయంగా మారింది. అత్యవసర సమయంలో స్మశానవాటికకు వెళ్లేందుకు రోడ్డు మార్గం సరిగా లేనందున గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. స్మశానవాటిక కు సిమెంట్ రోడ్డు కేటాయించాలని అధికారులకు విన్నవించుకున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మట్టి రోడ్డు పూర్తిగా ధ్వంసం అయినప్పటికీ ఇసుక ట్రాక్టర్లు అదే ధోరణిలో నడుపుతున్నారని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మార్గం లో ఇసుక తరలించే ట్రాక్టర్ డ్రైవర్, కూలీలకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇసుక ర్యాంప్ రోడ్డు ఎలా ఉన్నదో పరిశీలించకుండా మండల అధికారులు ఇసుక కూపన్లు మంజూరు చేయడంతో ట్రాక్టర్లు ఇసుక తరలించేందుకు వస్తున్నారని అన్నారు. ఇసుకు తరలించే పని అవ్వగానే ట్రాక్టర్ల ఓనర్లు ,మండల శాఖ అధికారులు చేతులు దులుపుకొని వెళ్లిపోతారని విమర్శించారు. స్మశానవాటిక కు వెళ్లే రోడ్డు మార్గం ప్రమాదకరంగా మరడం వలన స్థానిక గ్రామ ప్రజలకే నష్టం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని కోరారు. రోడ్డు పనులు చేపట్టకుండా సాటివారిగూడెం ఇసుక ర్యాంప్ నుండి ఇసుక తరలిస్తే ఊరుకునేది లేదని అవసరమైతే గ్రామ ప్రజల సమక్షంలో మండల కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. నిరసన తెలిపిన వారిలో వర్స లక్ష్మయ్య, వజ్జ చంద్రశేఖర్, కల్లాకుల నాగరాజు, వజ్జ రామకృష్ణ, వజ్జ లింగయ్య, వజ్జ శంకర్, పడిగ శేషరావు, వజ్జ వినయ్, సాగబోయిన చందు, పూనెం శంకర్, వజ్జ చందు తదితరులు ఉన్నారు.






