- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేంజర్ డెంగ్యూ.. వేగంగా విస్తరిస్తున్న జ్వరాలు
జిల్లాలో జ్వరాలు, డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.

దిశ, తల్లాడ: జిల్లాలో జ్వరాలు, డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. తల్లాడ మండలంలో ఇటీవల ఓ మహిళ డెంగ్యూతో మృత్యువాత పడగా అదే ఇంట్లో మరో ఇద్దరు డెంగ్యూ బాధితులు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 23 కేసులు నమోదవడంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తం అవుతున్నారు.
వైద్య యంత్రాంగం అప్రమత్తం..
తల్లాడ మండలంలో డెంగ్యూతో నాలుగు రోజుల క్రితం ఓ మహిళ మరణించిన విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ, అడిషనల్ కలెక్టర్ ఈ ప్రాంతానికి వచ్చి వైద్య బృందంతో మరణంపై పూర్తి విచారణ చేపట్టి, ప్రత్యేక అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో పారిశుధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలని మండల వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే పాటు అనుమానతలు రక్త నమూనాల సేకరించాలని తెలిపారు. ఎక్కడైతే జ్వరాలు, డెంగ్యూ బారినా పడతారో తక్షణమే ఆ ప్రాంతంలో రక్త నమోనాల సేకరణ, ఫాగింగ్ స్ప్రే చేయాలని ఆదేశించారు. దీంతో పాటు ముందుస్తుగా పంచాయతీలో నీటి నిల్వ లేకుండా చేయాలని ఆదేశించారు. డెంగ్యూకు కారణమైన దోమ 100 మీటర్ల కంటే ఎక్కువగా ఎగరలేదని ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి, ఎక్కడా నీటి నిల్వ లేకుండా డ్రై డే నిర్వహించాలని సూచించారు. అలాగే గతంలో అధికారులు కేసులు నమోదైన ప్రాంతాలను గ్రామాలను గుర్తించి అక్కడ ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ ఆదేశించారు. ప్రతి వారంలో రెండు రోజులు పాటు మండలంలో డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, అదే సమయంలో వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
వర్షాలతో లోపించిన పారిశుధ్యం..
పరిసరాలు అపరిశుభ్రత దోమల వ్యాప్తికి కారణం కావడంతో ప్రజలు జ్వరాల బారిన పడ్డారని తెలుస్తున్నది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ఈనెల మూడో వారం నుంచి వర్షాలు అధికంగా పడ్డాయి. దీంతో పల్లెల్లో పారిశుధ్య లోపం కనిపిస్తుంది. నిధుల లేమితో గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. పరిసర పరిశుభ్రతపై గ్రేడ్ కార్యక్రమాలు నిర్వహణలోనూ చిత్తశుద్ధి లోపిస్తుంది. ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలా గ్రామాల్లో వినియోగించిన కొబ్బరి బొండాలు, డ్రైనేజీలో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తి పెరుగుతున్నట్టు సమాచారం. దీంతో ప్రజలు డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నట్టు వైద్యాధికారు తెలుపుతున్నారు.
దోమల నివారణకు చర్యలు
తల్లాడ మండలంలోని జ్వరాల పరిస్థితి జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి డాక్టర్ చందు నాయక్ ప్రత్యేకంగా మండలంలోని నారాయణపురం గ్రామంలో ప్రతి గృహాన్ని సందర్శించి, నీటినిల్వ ప్రాంతంలో ఆయిల్ బాయిల్ వేయించారు. నీటి నిల్వ ప్రాంతంలో ద్రావణం పిచికారి చేయించారు. పారిశుధ్యం లోపించిన ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు. జ్వరం బారిన పడిన వారి ప్రాంతంలోని ప్రజల రక్త నమోనాలను సేకరించాలని వైద్య శాఖ అధికారులు ఆదేశించారు.






