- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధితుడి నగదును కాపాడిన సైబర్ సెక్యూరిటీ అధికారులు
దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ బి.అశోక్, సిఐ సముద్రాల జితేందర్ సైబర్ క్రైమ్ బాధితుని గుర్తించి అతని ఐదు లక్షల రూపాయల నగదును కాపాడిన బ్యాంక్ ఆఫ్

దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ బి.అశోక్, సిఐ సముద్రాల జితేందర్ సైబర్ క్రైమ్ బాధితుని గుర్తించి అతని ఐదు లక్షల రూపాయల నగదును కాపాడిన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ ఐ.నరేందర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి నకిలీ ఇన్వెస్ట్మెంట్ యాప్ లో పెట్టుబడులు పెట్టడాన్ని గుర్తించిన బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగూడెం బ్రాంచ్ సిబ్బంది, మేనేజర్ ఐ.నరేందర్ కొత్తగూడెం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు సమాచారం ఇవ్వడంతో, తక్షణమే స్పందించిన సైబర్ బ్యూరో సిబ్బంది బాధితుని చేరుకుని, కౌన్సిలింగ్ నిర్వహించి, అతడు సైబర్ క్రైమ్ లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఐదు లక్షల రూపాయలను కాపాడడం జరిగింది. బాధితునికి పది రోజుల క్రితం టెలిగ్రామ్ యాప్ లో ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి సైబర్ నేరగాళ్లు ఒక మెసేజ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ యాప్ లింకును పంపి, యాప్ లో పెట్టుబడి పెడితే తమ డబ్బు రెండు మూడు రెట్లు అవుతాయని చెప్పారు.
బాధితుడు అది సైబర్ నేరస్తుల పన్నాగమని గ్రహించక, ఇవ్వబడిన లింకు ద్వారా యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని, మొదట రెండు విడుతలుగా 10 వేల రూపాయలు, 20వేలు పెట్టుబడులు పెట్టడం జరిగింది. సైబర్ నేరగాళ్లు బాధితున్ని నమ్మించడం కోసం మొదటగా చెప్పినట్లుగా అతనికి రెండు విడతల్లో భాదితుని డబ్బును రెట్టింపు చేసి 20 వేల ఒకసారి, నలభై 40 వేల రూపాయలు ఒకసారి యాప్ అకౌంట్లో డిపాజిట్ చేసినారు. ఆ డబ్బును అతడు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్, వాట్సాప్, ఇంటర్నెట్ సోషల్ మీడియా యాప్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ కి సంబంధించిన మోసపూరిత ప్రకటనలను పంపిస్తూ సైబర్ బాధితులను రెట్టింపు లాభాన్ని పొందవచ్చని అత్యాశను కల్పిస్తూ నమ్మిస్తున్నారని, ఆ విధమైన మోసాలకు బలి కావద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ అశోక్ తెలిపారు. సైబర్ నేరాలలో ఎక్కువగా ఉద్యోగులు, వ్యాపారస్తులు లక్షలు, కోట్లలో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారని, సైబర్ నేరాలలో బాధితులు పోగొట్టుకుంటున్న నగదు 90 శాతం ఇలాంటి మోసాలలోనే కోల్పోతున్నారని కాబట్టి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ యాప్ లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని,బిజినెస్ నిపుణులను ప్రత్యక్షంగా కలుసుకొని సలహాలు తీసుకొని,ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీల గురించి విచారణ చేపట్టిన తర్వాత ముందుకు వెళ్లడం ద్వారా ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని తెలిపారు.






