- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 4.70కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. ఇద్దరి అరెస్ట్
వాట్సాప్ డీపీగా సంస్థ ఎండీ ఫొటో పెట్టుకొని ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.

దిశ, సత్తుపల్లి: హానర్ హోమ్స్ కంపెనీ ఎండీ ఫొటోను వాడుకొని ఆ సంస్థ ఉద్యోగిని మోసగించి రూ.4.70 కోట్లు కొట్టే సిన సైబర్ మోసం కేసులో ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. 'బాస్ స్కామ్'గా పిలుస్తున్న ఈ కేసులో సైబర్ నేరగాళ్లకు తన బ్యాంకు ఖాతాను అప్పగించి మోసానికి సహకరించిన వ్యక్తితో పాటు మరొకరిని అరెస్టు చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగో యల్ గురువారం తెలిపారు. హానర్ హోమ్స్ కంపెనీ ఎండీ స్వప్న కుమార్ పేరిట ఆ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుధాకర్ వాట్సా" లో ఇటీవల డబ్బు బదిలీకి సంబంధించి కొన్ని సందేశాలు వచ్చాయి. ఎండీ ఫొటోతో డీపీ ఉండటంతో ఏ మాత్రం అనుమానించకుండా వాట్సాప్‌లో పేర్కొన్న రెండు బ్యాంకు ఖాతాలకు సుధాకర్ రూ.1.80 కోట్లు, రూ.2.90 కోట్ల చొప్పున బదిలీ చేశారు. ఆ తర్వాత స్వప్న కుమార్ ఈ అంశంపై మాట్లాడటంతో మోసపోయినట్లు గుర్తించి ఈ నెల 2వ తేదీన సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సుధాకర్ ఫిర్యాదు చేశారు. హానర్ హోమ్స్ నుంచి లక్ష్మి సాయిశ్రీ టీఆర్డీ ఇన్ఫ్రాకు రూ.1.80 కోట్లు బదిలీ కావడంతో ఆ ఖాతా గురించి పోలీసులు ఆరా తీశారు. కొత్తపేటలో నివసిస్తున్న మండవల్లి శివనాగ రాజు ఐసీఐసీఐ బ్యాంకులో ఈ కరెంట్ ఖాతా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అతడిని అరెస్టు చేశారు. అప్పటికే నాగరాజు ఖాతాలోకి వచ్చిన రూ.1.80 కోట్లు వివిధ ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు.
అమాయకమైన ప్రజల వద్ద నుంచి క్రెడిట్ కార్డులను తీసుకొని..
ఈ లావాదేవీ నిర్వహించినందుకు శివనాగరాజుకు సైబర్ నేరగాళ్లు రూ.4 లక్షలు కమీషన్‌గా ఇచ్చినట్లు బయటపడింది. అయితే, తనకు సైబర్ నేరగాళ్లతో పరిచయం లేదని, సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయికి తన ఖాతాను అప్పగించానని శివనాగరాజు చెప్పడంతో అతడిని కూడా అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లకు కృష్ణ సాయి ఏజెంట్‌గా ఉండి మ్యూల్ ఖాతాలను అందిస్తున్నట్లు విచారణలో తేలింది. గతంలోనూ సత్తుపల్లి కేంద్రంగా దాదాపు రూ.600 కోట్లు మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లకు బదిలీ అయ్యాయి. రాజస్థాన్, తమిళనాడులో జరిగిన సైబర్ నేరాల ద్వారా శివనాగరాజు ఖాతాలకు రూ.2.49 కోట్లు వచ్చినట్లు గుర్తించారు. హానర్ హోమ్స్ నుంచి రూ.2.90 కోట్ల బదిలీకి ఉపయోగించిన రచన టెక్నాలజీస్/ బంధన్బ్యాంకు ఖాతా పై దర్యాప్తు జరుగుతోందని శిఖాగోయల్ తెలిపారు. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వచ్చే సందేశాలను ఫోన్ ద్వారా మాట్లాడి ధ్రువీకరించుకున్న తర్వాతే నిధులు బదిలీ చేయాలని ఆమె సూచించారు. దోసపాటి కృష్ణ సాయి వినాయక గ్రాండ్ హోటల్ కాంప్లెక్స్ లో గల శ్రీ రాఘవేంద్ర ఆన్లైన్ సర్వీస్ సెంటర్ నడుపుతూ స్థానిక అమాయకమైన ప్రజల వద్ద నుంచి క్రెడిట్ కార్డులను తీసుకొని తన అవసరాలకు వినియోగించుకుంటూ వినియోగదారులను మోసం చేస్తూ ఇలాంటి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నాడని ప్రజల ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.






