తక్షణమే పంట నష్టపరిహారం అందించాలి

by Sridhar Babu |

అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.

తక్షణమే పంట నష్టపరిహారం అందించాలి
X

దిశ,తిరుమలాయపాలెం : అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ధర్నాలో సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ మండలంలోని ఆకేరు పరీవాహక గ్రామాల్లో వరదలతో వందల ఎకరాల పంట ధ్వంసమైందని, వ్యవసాయ భూములు స్వరూపం కోల్పోయాయని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించాలని కోరారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నాయకులు తుళ్లూరు నాగేశ్వరరావు, కొలిచలం స్వామి, దేశ్య, భానుచందర్ పాల్గొన్నారు.

Next Story