స్థానిక ఎన్నిక‌ల్లో సీపీఐ బలాన్ని మరోసారి నిరూపించాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

by Ratna Kumari |   (  Updated:2025-11-29 16:28:26  IST  )

దిశ, పాల్వంచ టౌన్ : సర్పంచ్ ఎన్నికల్లో మండల పరిధిలో అధిక స్థానాలలో గెలిచి సీపీఐ బలాన్ని మరోసారి నిరూపించాలినీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

స్థానిక ఎన్నిక‌ల్లో సీపీఐ బలాన్ని మరోసారి నిరూపించాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
X

దిశ, పాల్వంచ టౌన్ : సర్పంచ్ ఎన్నికల్లో మండల పరిధిలో అధిక స్థానాలలో గెలిచి సీపీఐ బలాన్ని మరోసారి నిరూపించాలినీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. శనివారం చండ్ర రాజేశ్వరరావు భవన్ లో మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో మండల ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మరువలేనిది అనీ స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాలుగా మండల పరిధిలో ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులే సర్పంచ్ అభ్యర్థులు గెలుపుకు బాటలు వేస్తుందని, గ్రామాలలో సమష్టిగా, సమన్వయంతో ప్రజలతో మమేకమైతే సీపీఐ మద్దతుదారులు సర్పంచ్ ఎన్నికల విజయం సాధించడం ఖాయం అని అన్నారు. ఇంటింటి కి తిరుగుతూ ప్రతి ఓటరునీ కలవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. నామినేషన్ కు కావలసిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని తలిపారు. మండల పరిధిలో ఇప్పటికే వివిధ గ్రాంట్లు ద్వారా అనేక అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు తలిపారు. రానున్న రోజుల్లో పాల్వంచ మందలని అని రకాలుగా మరింత అభివృద్ధి చేసుకుందామని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు గుండాల నాగరాజు, ఇట్టి వెంకట్రావు, నాయకులు డి చెన్నయ్య, వీరమోహనరావు, ఉండ్రాతి రవి, కొంగర అప్పారావు, వల్లపు యాకయ్య, జకరయ్య, భూక్యా విజయ, కృష్ణ, సురేష్, రంజిత్, రవి, చందూలాల్, హరి, బాలాజీ, లాసింగ్ పాల్గొన్నారు.

Next Story