- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాదె ఇన్నయ్య అరెస్ట్..ఖండించిన CPI (ML) మాస్ లైన్
by velandi.Saikiran |
గాదె ఇన్నయ్యను (ఎన్ ఐ ఏ )ఉపా చట్టం కింద అరెస్టు చేయడం దుర్మార్గమని సిపిఐ (యమ్ యల్ ) మాస్ లైన్ ఆదివారం

X
దిశ, ఖమ్మం టౌన్ : తెలంగాణా ఉద్యమ కారుడు, ప్రజాతంత్ర వాది గాదె ఇన్నయ్యను (ఎన్ ఐ ఏ )ఉపా చట్టం కింద అరెస్టు చేయడం దుర్మార్గమని సిపిఐ (యమ్ యల్ ) మాస్ లైన్ ఆదివారం ఓ ప్రకటనలో ఖండించింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను టార్గెట్ చేసి నిర్మూలన చేయాలని పిలుపునిచ్చి , నరమేధాన్ని అమలు చేస్తోందని ఫైర్ అయింది. దానిని వ్యతిరేకిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలు ప్రారంభించిందని పేర్కొంది. అందులో భాగంగానే గాదె ఇన్నయ్య, మరికొందరిపై ఉపా కేసులు బనాయుంపు చేస్తున్నారని మండిపడింది. ఈ కేసును ఉపసంహరించుకుని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వేనుకాడబొమని పిలుపునిచ్చింది.
Next Story






