- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం రవాణాశాఖలో అవినీతి రాజాలు.. ఏసీబీ రైడ్స్‌నూ పట్టించుకోని ఆనకొండలు
ఖమ్మం రవాణాశాఖలో మళ్లీ అవినీతి రాజ్యమేలుతుంది. ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా.. కొద్దిరోజులు మాత్రమే కామ్ గా ఉంటున్న అధికారులు మళ్లీ తమ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు.

ఖమ్మం రవాణాశాఖలో మళ్లీ అవినీతి రాజ్యమేలుతుంది. ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా.. కొద్దిరోజులు మాత్రమే కామ్ గా ఉంటున్న అధికారులు మళ్లీ తమ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. ఏజెంట్లు ఇండికేషన్ లేకుండా ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా ముందుకు కదలడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు సెలవుపై వెళ్లిన అధికారి తిరిగి విధుల్లో చేరడంతో మళ్లీ ఈ దందా మూడు పూలు ఆరుకాయలుగా సాగుతుందన్న చర్చ నడుస్తుంది. అడ్డుకట్ట వేయాల్సిన ఉన్నతాధికారి కూడా ఈ దందాలో భాగం పంచుకుంటున్నట్లు ఆరోపణలు రావడం విస్మయం కలిగిస్తుంది. - దిశ, ఖమ్మం
ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏదైనా సాధ్యం అంటూ ఓ అధికారి నిరూపించాడు. రవాణా శాఖ కార్యాలయంలో ఇంచార్జీ రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అధికారి ప్రతి ఫైల్‌కు ఓ రెటు ఫిక్స్ చేసి కార్యాలయంలో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు నడిపించాడు. ఇతని ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కొంతమంది రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఈ అధికారి పై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేశారు. ప్రతీ దరఖాస్తు ధరను డబుల్ చేయాలని సదరు అధికారి సూచించడంతో ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ఎదుట ఉన్న కొంతమంది సీనియర్ ఏజెంట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ రైడ్స్ జరిగినా.. ఈ అధికారి వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తి ప్రతీరోజు ఏజెంట్ల దగ్గర డబ్బుల కలెక్షన్ చేసేవాడని తెలిసినా అధికారిపై చర్యలు తీసుకోలేదు. ఇతను ఇంచార్జీ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో రోజుకు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులకు తెలిసి కూడా ఎందుకు మీనమేషాలు లెక్కింస్తున్నారో ఆర్టీఏ ఏజెంట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చర్యలు ఏవి..?
ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో గత ఏడాది డిసెంబర్ నెలలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఈ అధికారి ప్రైవేట్ ఏజెంట్లు నుండి నగదును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఈ నగదు ఆ అధికారిదే అంటూ ప్రైవేట్ ఏజెంట్లు లిఖితపూర్వకంగా రాసి ఇస్తే ఏసీబీ అధికారులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరుగుతున్న సమయంలో ఈ అధికారి కలెక్టరేట్ కార్యాలయంలో మీటింగ్ లో ఉన్నారు. కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారని సంగతి తెలుసుకుని వెంటనే అధికారి ఇంట్లో ఉన్న నగదు, పల్లు కీలక డాక్యుమెంట్లు బయటకు పంపించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు రెండు రోజులు రవాణాశాఖ కార్యాలయంలో హడావిడు చేసి అధికారి అవినీతి చిట్టాను తయారు చేసి పై అధికారులకు సమర్పించారు. ఏసీబీ దాడులు జరిగిన నాటి నుంచి ఈ అధికారి రెండు నెలల పాటు వ్యక్తిగత సెలవులోకి వెళ్ళాడు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు దొరికనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రైవేట్ ఏజెంట్లు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఫైలుకు రేటు ఫిక్స్ చేసుకుంటూ విచ్చలవిడిగా వసూలు చేసినట్టు విచారణలో తేలిన ఇప్పటివరకు అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
కేసు నుంచి బయట పడేందుకు చేతులు మారిన లక్షల రూపాయలు...?
ఖమ్మంలో జరిగిన ఏసీబీ దాడుల్లో బయటపడేందుకు అధికారి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రభుత్వంలో కీలక మంత్రి ద్వారా లాబింగ్ చేసి ఎటువంటి కేసులు లేకుండా మేనేజ్ చేసినట్లు తెలుస్తుంది. రెండు నెలల పాటు సెలవుల్లో ఉండి ఏసీబీ కేసు నుంచి బయట పడేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు ఏజెంట్లు బహిరంగంగా చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున విమర్శలు ఉన్న అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మళ్లీ ఇక్కడే విధులు నిర్వహించటం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు రోజువారీ వసూళ్లలో ఉన్నతాధికారులు కూడా భాగమయ్యారని ఫలితంగా అక్రమార్కులే ఈ కార్యాలయంలో తిష్ట వేసే అవకాశం ఏర్పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.






