రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ: డిప్యూటీ సీఎం

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-13 10:27:07  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనం గా పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ: డిప్యూటీ సీఎం
X

దిశ, ముదిగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనం గా పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండల పరిధిలోని గంధసిరి గ్రామంలో వేంచేసి ఉన్న కాకతీయుల కాలం నాటి శ్రీ సుందర మౌలేశ్వరస్వామి పురాతన ఆలయ పునర్నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రెండు కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా గురువారం గంధసిరి గ్రామంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపనకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆలయ నిర్మాణా శంకుస్థాపన కు వచ్చిన భట్టి విక్రమార్క కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని గుడి వద్దకు చేరుకొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. నేను ఆనాడు చేసిన పీపుల్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గంధసిరి గ్రామానికి చేరుకోగానే కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్న కాకతీయుల కాలం నాటి శ్రీ సుందర మౌలేశ్వరస్వామి పురాతన ఆలయం గురించి చెప్పారు.

నేను ఆరోజు మాట ఇచ్చా మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ గుడికి కావలసిన ఏర్పాట్లు చేస్తా అని చెప్పా ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు 2 కోట్లు నిధులు మంజూరు చేశాను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఇచ్చే పథకాల గురించి ప్రజలకు మరోసారి వివరించారు. మహిళలు కూరగాయలకు మార్కెట్ కి వెళ్ళాలి అన్నా ఉచిత బస్సులోనే ప్రయాణిస్తున్నారు. ఆనాడు టిఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదు టిఆర్ఎస్ ఉంటేనే కరెంట్ ఉంటుంది అన్నారు. అసలు రాష్టంలో కరెంటు ఉత్పత్తి చేసిందే కాంగ్రెస్ పార్టీ, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదు.

కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్రూప్ 1,గ్రూప్ 2 ఇతర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి వారికి నియామక పత్రాలు అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కల్పించాం. అందుకే నేను చాలా ధైర్యంగా చెప్పగలను ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలే, మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఎలాంటి సమస్య వచ్చినా మీ బిడ్డగా నేను నిలబడతానని ప్రజల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్, లోకల్ బాడీ కలెక్టర్ శ్రీజ,DRDO పిడి సన్నాసయ్య, అధికారులు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

మధిర నియోజకవర్గం అధికారులకు సమీక్ష..

మధిర నియోజకవర్గ వ్యాప్తంగా విద్యాశాఖ మరియు ఇందిరా మహిళా డెయిరీ పై సంబంధిత అధికారులకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్, లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ శ్రీజ, అధికారులు పాల్గొన్నారు.

READ MORE .....

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మిస్తే బిల్లులు వేగంగా మంజూరు.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Next Story