- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏన్కూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అవస్థలు
మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల పాఠశాలను ఎన్టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించారు.

దిశ, ఏన్కూర్ : మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల పాఠశాలను ఎన్టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించారు. ప్రస్తుతం ఏంకూర్ తెలంగాణ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సుమారు 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థులు డార్మెంటరీ రూములు సరిపోక తరగతి గదిలోనే చదువుకుంటూ, తరగతి గదిలోనే రాత్రిపూట పడుకుంటున్నారు. ఇలా విద్యార్థులు ఇబ్బందుపడుతున్న సందర్భాలు ఎక్కడ ఉండకపోవచ్చు అని అంటున్నారు. క్లాస్ రూమ్ లోనే పడక గదులు, విద్యార్థుల సామాగ్రి పెడుతున్నారు. విద్యార్థులు పడుకోవడానికి తెచ్చుకున్న చాపలు, ట్రంకు పెట్టెలు, ఇతర సామాగ్రి సైతం క్లాస్ రూమ్ లోనే దాచుకోవడం జరుగుతోంది. దీనిపై ఇప్పటికైనా అధికారులు.... కళ్లు తెరిచి విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు.






