- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదోడి సంక్షేమంలో తెలంగాణా నంబర్ 1: మంత్రి పొంగులేటి
పేదల సంక్షేమంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

దిశ, నేలకొండపల్లి: పేదల సంక్షేమంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని పాలేరు శాసన సభ్యులు, రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలంలో పర్యటించిన ఆయన, 20లక్షల రూపాయలతో నిర్మించిన భైరవునిపల్లి గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బుద్దారం గ్రామ పరిధిలో 2కోట్ల రూపాయల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నామని చెప్పారు.
25లక్షలమంది రైతులకు..
గత ప్రభుత్వం పదేళ్లు పేదోడి ఇళ్ల గురించి ఆలోచన చేయలేదన్నారు. పేదల ప్రభుత్వంలో ఇప్పటికే 4.5లక్షల ఇళ్లను ఇచ్చామని, మరో వారం రోజుల్లో 2.5లక్షల ఇళ్లు ఇస్తామని హామీనిచ్చారు. గత రెండున్నర ఏళ్లుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా 25లక్షలమంది రైతులకు 21వేలకోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. పంట పండించిన రైతుల చేతులకు బేడీలు వేసిన ఘనత గత ప్రభుత్వానిదైతే, ఆ పండించిన పంటకు బోనస్ ఇచ్చిన ఘనత తమదన్నారు. ప్రజల ఆశీస్సులతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.






