మూడు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే: ఎమ్మెల్యే

by Kodari Anjali |

వైరా రిజర్వాయర్ కింద 30 వేల ఎకరాలు సాగునీరు కోసం గోదారమ్మను కృష్ణమును గెలిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైరా ఎమ్మెల్యేగా తనకే దక్కుతుందని, ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు.

మూడు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే: ఎమ్మెల్యే
X

దిశ, ఏన్కూర్: వైరా రిజర్వాయర్ కింద 30 వేల ఎకరాలు సాగునీరు కోసం గోదారమ్మను కృష్ణమును గెలిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైరా ఎమ్మెల్యేగా తనకే దక్కుతుందని, ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తిమ్మరావుపేట సమీపంలో నాగార్జునసాగర్ కాలవ పై వైరా రిజర్వాయర్ వెళ్లే ఎస్కేపులను ఎత్తి రిజర్వాయర్కు నీళ్లు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుందన్నారు. గోదావరి జలాలను వైరా రిజర్వాయర్ కు వదిలి ఆయుకట్టు కింద ఉన్న సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే ధ్యేయంగా పనిచేయడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు ధనం వృథా జరిగిందని, ఒక్క ప్రాజెక్టు కూడా రూపకల్పన చేసిన దాఖలు లేవు అన్నారు.

వైరా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే..

గత పది సంవత్సరాల కాలంలో ప్రజల సంక్షేమ మరిచి దోచుకోవటమే ధ్యేయంగా కేసీఆర్ కుటుంబం పనిచేసింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా, సాగు నీరు, త్రాగునీరు, విద్య, వైద్యం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. వైరా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే కోసం ఎంతవరకైనా పోరాడుతున్న అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్, పువాళ్ళ దుర్గాప్రసాద్, ఏన్కూర్ సొసైటీ అధ్యక్షులు, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, స్వర్ణ నరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్, లచ్చి రామ్ నాయక్, మాజీ చైర్మన్, భూక్య లాలు నాయక్, మేడ ధర్మారావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు బోర్ర రాజశేఖర్, వడ్డే నారాయణ, డాక్టర్ కాపా మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Next Story