పగిడేరుపై బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు

by Kodari Anjali |

ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలం అయ్యిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు.

పగిడేరుపై బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
X

దిశ, కొణిజర్ల: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామ సమీపంలోని పగిడేరు వాగుపై లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలుపుదల చేయటాన్ని నిరసిస్తూ గ్రామస్తులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా నాయకులు లకావత్ గిరిబాబు పోట్ల శ్రీనివాసరావుతో కలిసి బ్రిడ్జి నిర్మాణా ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తాత మధు మాట్లాడుతూ.. తుమ్మలపల్లి గ్రామ సమీపంలోని పగిడేరు వాగుపై 75 లక్షల రూపాయలతో రైతులకు అవసరమైన లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంటే అధికార పార్టీ నాయకులు బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు..

ప్రజా పాలన అని చెప్పుకుంటూ అభివృద్ధిని అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. వర్షాకాలంలో వాగు పొంగటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ఎమ్మెల్యే దీనిపై చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి సాలెబంజర గ్రామ సర్పంచ్ డేరంగుల వెంకటరమణ, శ్రీను, పోగుల శ్రీనివాసరావు, నాయకులు కిలారు మాధవరావు, డేరంగుల బ్రహ్మం, పాసంగులపాటి శ్రీను, దొడ్డపనేని రామారావు, ఎర్ర కృష్ణయ్య, ఒత్తులు వెంకన్న, ఇజ్జగాని రామారావు, ఏసు జోగు, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, ఉపేందర్, ధనేకుల ఉపేందర్ పాల్గొన్నారు.

Next Story