- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలాంటి ప్రలోభాలకు గురి కావొద్దు
by velandi.Saikiran |
జిల్లాలోని ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా

X
దిశ, కొత్తగూడెం: జిల్లాలోని ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. ఐడిఓసి లోని తన చాంబర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన మాట్లాడారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలని సూచించారు. మన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలంటే ప్రజలంతా చైతన్యవంతులై మద్యం డబ్బు పంపిణీకి తావివ్వకుండా ఓటు వేయాలని సూచించారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిందని అన్నారు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారమే ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు.
Next Story






