- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, ప్రజలు స్వేచ్ఛ, న్యాయబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

దిశ, ఖమ్మం కార్పొరేషన్: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, ప్రజలు స్వేచ్ఛ, న్యాయబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. రెండవ విడత గ్రామ పంచాయతీల ఎన్నికల సందర్భంగా.. శనివారం కూసుమంచి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కామేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ లో వినియోగించే, ఎన్నికల సామాగ్రిని పరిశీలించి, పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేస్తూ, నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలని, ఎక్కడ ఎటువంటి వివాదాలు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలని అన్నారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి చెక్ లిస్టు ఆధారంగా అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక తదితర అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పంచాయతీ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది తమ విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ఆదివారం రెండవ విడతలో జిల్లాలో ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయ పాలెం, కామేపల్లి పరిధిలో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందని, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ నిర్వహించి, ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేసి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించామని వివరించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ గుర్తించి క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరా ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, సెన్సిటివ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.
గ్రామ పంచాయతీ పోలింగ్ లో ప్రజలు స్వేచ్ఛ, న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యం ద్వారా లభించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలని అన్నారు. గ్రామంలో ప్రతి ఓటు విలువైనదని, ఓటర్లు అందరూ నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, ఎవరి ప్రభావానికి లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కలెక్టర్ కోరారు. పోలింగ్ సిబ్బంది, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, తాగునీరు, ఓటర్లకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు యం.వి. మధుసూదన్, శ్రీలత, ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ బి. శ్రీనివాసులు, తహశీల్దార్లు సుధాకర్, రవి కుమార్, యంపిడివో లు రవీందర్, జశ్వంత్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






