- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీలపై కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయి సమీక్ష
ప్రభుత్వ పాఠశాలలు, ఫ్రీ ప్రైమరీ పాఠశాలలు, అంగన్‌వాడీలపై కలెక్టర్ అంకిత్ క్షేత్ర స్థాయి సమీక్ష ఆళ్లపల్లి మండలం లో మంగళవారం నిర్వహించారు.

దిశ, ఆళ్లపల్లి : ప్రభుత్వ పాఠశాలలు, ఫ్రీ ప్రైమరీ పాఠశాలలు, అంగన్‌వాడీలపై కలెక్టర్ అంకిత్ క్షేత్ర స్థాయి సమీక్ష ఆళ్లపల్లి మండలం లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద వెంకటాపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, పోషకాహారం పరీశీలించారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజన నాణ్యత, మెనూ పాటింపును స్వయంగా పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి పిల్లలతో మాట్లాడి వారి విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న పోషక సేవలను పరిశీలించారు. గుడ్లు, పాలు, బాలామృతం పంపిణీ, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవల రికార్డులను తనిఖీ చేశారు. "పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించడంలో ఎలాంటి రాజీ వద్దు. రికార్డులు పక్కాగా ఉండాలి" అని సిబ్బందిని ఆదేశించారు. లక్ష్మీపురం గ్రామం వద్ద కుంగిన కల్వర్టుపై పర్యటనలో భాగంగా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రమాదకరంగా మారిన కల్వర్టు వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ అంకిత్, "ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణమే అధికారులు పరిశీలించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.అధికారులకు దిశానిర్దేశం ప్రభుత్వ పథకాలు పేదలకు పూర్తిస్థాయిలో అందేలా మండల అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని సూచించారు.కలెక్టర్ వెంట తాహసిల్దార్ ఉమారాణి, ఎంపీడీవో శ్రీనివాస్, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






