నేడు భద్రాచలంలో సీఎం రేవంత్ పర్యటన..షెడ్యూల్ ఇదే

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ భద్రాచలంలో పర్యటించనున్నారు.

నేడు భద్రాచలంలో సీఎం రేవంత్ పర్యటన..షెడ్యూల్ ఇదే
X

దిశ, భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని, రూ. 351 కోట్లతో ఆలయ విస్తరణ తొలిదశ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేస్తారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న ఇలా

భద్రాచలం పుణ్యక్షేత్రంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణంలో స్వామి వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 8.45 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని, అక్క‌డి నుంచి 10.10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు.

అనంతరం సారపాక లోని ఐటీసీ గెస్ట్ హౌస్ కు బయలుదేరి, అర్ధగంట విశ్రాంతి తీసుకుంటారు. 10.30 గంట‌ల‌కు భద్రాచలం బయలుదేరి 10.40 నుంచి 11 గంటల మ‌ధ్య‌ భద్రాద్రి రామయ్యను దర్శించుకొనున్నారు. 11.05 నిమిషాలకు ఆలయ అభివృద్ధి కోసం భూమి పూజ చేయనున్నారు. భూమిపూజ అనంతరం మిథలా స్టేడియంలో జరిగే రామయ్య కళ్యాణంలో పాల్గొంటారు. స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఆ త‌ర్వాత హైదరాబాద్ బ‌య‌లు దేరుతారు.

Next Story