- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మంలో ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకు మధ్య ఘర్షణ
ఖమ్మం(Khammam) జిల్లాలో గురువారం ఖమ్మంలో ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది.

దిశ, వెబ్ డెస్క్ : ఖమ్మం(Khammam) జిల్లాలో గురువారం ఖమ్మంలో ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలంలో అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ లో ఆక్రమణ తొలగింపు చేపట్టగా.. పోడు రైతులు అడ్డుకున్నారు. అయితే 2020లో అటవీ శాఖ అధికారులు, పోడు రైతులు సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకుని, వారికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఐదేళ్లు గడిచినప్పటికీ ఈ హామీ నెరవేరలేదు. దీంతో రైతులు తమ పాత పోడు భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోడు రైతులు ఆ భూములపై టెంట్లు వేసుకోగా, అటవీ అధికారులు వాటిని తొలగించేందుకు వచ్చారు. దీనితో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం రేగి చివరికి ఘర్షణకు దారితీసింది.
ఈ ఘటనలో రైతులు అధికారులపై రాళ్లతో దాడి చేయగా.. అధికారులు కూడా రైతులను అడ్డుకునే ప్రయత్నంలో వారిని కొట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన కొద్దిమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత, రైతులు, అటవీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. రైతులు, తమ జీవనాధారమైన పోడు భూములను కాపాడుకునే హక్కు తమకు ఉందని, అటవీ శాఖ అక్రమంగా తమ భూములను స్వాధీనం చేసుకుందని ఆరోపిస్తుండగా... అటవీ అధికారులు ఈ భూములు అటవీ శాఖకు చెందినవని, ఆక్రమణలను తొలగించడం తమ డ్యూటీ అని పేర్కొన్నారు.






