బీజేపీ అధ్యక్షున్ని కలిసిన నాయకులు

by velandi.Saikiran |

నాగులవంచ రైల్వే స్టేషన్ లో సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆఫీసులో మర్యాదా

బీజేపీ అధ్యక్షున్ని కలిసిన నాయకులు
X

దిశ, చింతకాని: నాగులవంచ రైల్వే స్టేషన్ లో సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆఫీసులో మర్యాదా పూర్వకంగా కలిసారు మండల నాయకులు. ఈ సందర్బంగా నాగులవంచ రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు కూర్చోవడానికి బళ్లాలు,మంచినీటి సదుపాయాలు,విద్యుత్తు లైట్లు, బ్రిడ్జి సమస్యలపై వారికి వివరించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇక ఎన్ రామచంద్రరావు సానుకూలంగా స్పందించి రైల్వే వారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కొండా గోపి తో పాటు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు,కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు సోమగాని ఎల్లారావు గౌడ్,అమరనేని విజయ్,నాగులు, పరుశురాము తదితరులు పాల్గొన్నారు.

Next Story