- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో పడి చిన్నారి మృతి
ప్రమాదవశాత్తు చెరువులో పడి లకావత్ వర్షిత (14) మృతి చెందిన సంఘటన టేకులపల్లి మండలంలో సోమవారం చోటు చేసుకుంది.

దిశ, టేకులపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి లకావత్ వర్షిత (14) మృతి చెందిన సంఘటన టేకులపల్లి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం, ఉదయం10:30కు లకావత్ వర్షిత, మేఘా, జశ్విత శ్రీ లు ముగ్గురు అమ్మాయిలు తెల్లవాగు చెరువు వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు లకావత్ వర్షిత చెరువులో జారి పడింది. ఈ విషయాన్ని మేఘ, జస్విత శ్రీ లు ఎవరికి చెప్పకుండా ఇంటికి వచ్చేశారు. సాయంత్రం సమయంలో వర్షిత ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు వెతుకుతూ, మిగిలిన ఇద్దరు బాలికలను అడిగారు. దీంతో వర్షిత చెరువులో పడిన ఘటన గురించి చెప్పారు. దీంతో జేత్యా తండా గ్రామస్తులు... సుమారు ఒక గంటపాటు వెతకగా హరి అనే యువకుడు చాకచక్యంగా ఆ బాలిక మృతదేహాన్ని బయటకి తీసుకొచ్చాడు. ఈ సంఘటనపై టేకులపల్లి ఎస్ ఐ అలకుంట రాజేందర్ మాట్లాడుతూ తల్లి తండ్రులు ఇలాంటి విషయాల పై అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలపైన ఓ కన్నేసి ఉంచాలని పేర్కొన్నారు.






