N Chandrababu Naidu : 21న ఖమ్మం రానున్న చంద్రబాబు

by Sridhar Babu |   (  Updated:2023-11-23 13:31:03  IST  )

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21న ఖమ్మంలో జరిగే టీడీపీ భారీ భహిరంగ సభకు హాజరు కానున్నారని జిల్లా టీడీపీ నేత తోటకూరి శివయ్య తెలిపారు.

N Chandrababu Naidu : 21న ఖమ్మం రానున్న చంద్రబాబు
X

దిశ,కామేపల్లి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21న ఖమ్మంలో జరిగే టీడీపీ భారీ భహిరంగ సభకు హాజరు కానున్నారని జిల్లా టీడీపీ నేత తోటకూరి శివయ్య తెలిపారు. ఆదివారం కామేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 21న ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ మహాసభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి టీడీపీ కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ నేత, కామేపల్లి మాజీ సర్పంచ్ హజ్మీర హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.

Focus On Vizianagaram: మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

YSR ను గుర్తు చేస్తోన్న టీపీసీసీ చీఫ్ పాదయాత్ర టైటిల్

Next Story