- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసుల కార్యదర్శి పై బదిలీ వేటు
మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు అధికార యంత్రాంగాన్ని కదిలించాయి.

దిశ,కారేపల్లి: మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు అధికార యంత్రాంగాన్ని కదిలించాయి. కాసులిస్తేనే పని అంటూ "దిశ" దినపత్రికలో బుధవారం ప్రచురితమైన కథనంపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్‌ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో చోటుకు బదిలీ చేసినట్లు మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) రవీంద్ర ప్రసాద్ గురువారం వెల్లడించారు. కథనం వెలువడిన వెంటనే జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) రాంబాబు ఆదేశాల మేరకు ఎంపీవో బాధితుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు. ప్రస్తుతం ఆరోపణలపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, విచారణలో వెలుగులోకి వచ్చే అన్ని అంశాలను పరిశీలించి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఎంపీఓ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. అవినీతి ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా విచారణ నిర్వహించి, బాధ్యులపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, అవినీతిపై వెలుగులోకి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు తీసుకున్న తక్షణ చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విచారణ నివేదిక అనంతరం మరిన్ని చర్యలు ఉండే అవకాశమున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.






