- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"దిశ ఎఫెక్ట్".. బెల్ట్ షాప్ నిర్వహకుడిపై కేసు నమోదు
తిరుమలాయపాలెం గ్రామంలోని ఖమ్మం - వరంగల్ హైవే పక్కన ఉన్న ఎస్.ఆర్ కిరణం దుకాణంలో రైడింగ్ జరిపారు.

దిశ, తిరుమలాయపాలెం: గణతంత్ర దినోత్సవం రోజు తిరుమలాయపాలెం మండలంలో అక్రమంగా, అధిక ధరలకు మద్యం అమ్ముతున్న విషయంపై దిశ పత్రిక ఈ నెల 26న బ్రేకింగ్ న్యూస్, 27న గణతంత్ర దినోత్సవం రోజు మద్యం అమ్మకాలు అనే శీర్షిక కథనం ప్రచురించిన సంగతి విధితమే. "దిశ కథనం" ద్వారా అట్టి విషయం తెలుసుకున్న ఖమ్మం ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్, తిరుమలాయపాలెం గ్రామంలోని ఖమ్మం - వరంగల్ హైవే పక్కన ఉన్న ఎస్.ఆర్ కిరణం దుకాణంలో రైడింగ్ జరిపారు. ఈ రైడింగ్ లో సుమారు రూ.3000వేలు విలువ చేసే (1.8లీటర్స్ మద్యం) గుర్తించినట్లు తెలిపారు. ఎర్రగడ్డ గ్రామానికి చెందిన సోమనపల్లి రంజిత్ అనే వ్యక్తి అట్టి బెల్ట్ షాపు నిర్వహిస్తుండగా,అతడిపై కేసు నమోదు చేసినట్లు బుధవారం ఎక్సైజ్ సీఐ తెలిపారు. కాగా ఇదే విషయాలలో బెల్ట్ షాప్ నిర్వాహకుడు రంజిత్ పై, ఇదివరకే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో రెండుసార్లు కేసు నమోదైనట్లు తెలిసింది.






