- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఆళ్లపళ్లి మండల పరిధిలోని రూ.60 లక్షల విలువైన 300 కేజీల గంజాయిని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.

దిశ, గుండాల: ఆళ్లపళ్లి మండల పరిధిలోని రూ.60 లక్షల విలువైన 300 కేజీల గంజాయిని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన నునావత్ భారత్ కార్ డ్రైవర్ గా పని చేస్తూ సుమన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సుమన్, భరత్ కలిసి హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చి అక్కడ నుంచి మారేడుమిల్లి వెళ్లి గంజాయి సేకరించి తిరుగు ప్రయాణంలో కొత్తగూడెం పాల్వంచం మీదగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్లాన్ వేశారు.
పక్కా సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టగా పాల్వంచ నుంచి అడవి మార్గంలో ఆళ్లపెళ్లి ప్రాంతంలోకి వచ్చిన వాహనాన్ని ఎస్సై రితీష్ ఆధ్వర్యంలో కారును అడ్డగించారు. వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయగా 300 కేజీల గంజాయి లభ్యమైనట్లు, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రితీష్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, శివ కృష్ణ, ఉపేందర్, కన్నయ్య, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.






