- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేతకు వెళుతున్న గేదెలు మాయం.. ముగ్గురు నిందితులు అరెస్ట్...
మేత కోసం వదిలిన గేదెలను దొంగిలించి ట్రాలీ ఆటోలలో తరలించి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను తల్లాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

దిశ, తల్లాడ: మేత కోసం వదిలిన గేదెలను దొంగిలించి ట్రాలీ ఆటోలలో తరలించి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను తల్లాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లవరం, అన్నారుగూడెం గ్రామాలకు చెందిన రైతులు మేత కోసం వదిలిన గేదెలు కనిపించకుండా పోతున్నాయని ఈ నెల 12న తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్. వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు మల్లారం గ్రామానికి చెందిన కటికి శ్రీకాంత్, చౌడా పవన్, దడిపల్లి కాళేశ్వరరావు వ్యసనాలకు బానిసై మేతకు వదిలిన గేదెలను దొంగిలించి ట్రాలీ ఆటోలలో తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెంకటకృష్ణ వెల్లడించారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోందన్నారు.






