దేశానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్,కాంగ్రెస్‌లు వ్యవహరిస్తున్నాయి : రామచంద్ర రావు

by Chintha Aamani |

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు అనుకూలంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడుతూ దేశం పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు అన్నారు.

దేశానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్,కాంగ్రెస్‌లు వ్యవహరిస్తున్నాయి : రామచంద్ర రావు
X

దిశ,ఇల్లందు: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు అనుకూలంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడుతూ దేశం పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు అన్నారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీపై వ్యతిరేకతతోనే ఆపరేషన్ సిందూర్ పైన రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పేరుతో ఓ బీసీలకు అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ లో 10 శాతం ముస్లింలకు కేటాయిస్తే ఓబీసీలకు మిగిలేది ఏమిటని ప్రశ్నించారు.

కేవలం రాజకీయ మతపరమైన లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్ బిల్లును తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇస్తే బీసీలకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర అధ్యక్షుడిగా హామీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఖమ్మం- నల్గొండ-మహబూబ్ నగర్ జిల్లాల్లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పర్యటన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సీపీఎం కు చెందిన క్యాడర్ బీజేపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లా గడ్డను బీజేపీ అడ్డాగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షురాలు సుచిత్ర పాసి, మండల అధ్యక్షుడు బట్టు రమేష్, సేనాపతి మురళీకృష్ణ, నియోజకవర్గ నాయకులు గోపికృష్ణ, మాధవ్, నాగన్న, శాసనాల రామయ్య తదితరులు పాల్గోన్నారు.

Next Story