గ్రామపంచాయతీల్లో ఏకో బ్రిక్స్ తయారు చేయాలి

by Sridhar Babu |
గ్రామపంచాయతీల్లో ఏకో బ్రిక్స్ తయారు చేయాలి
X

దిశ, కొత్తగూడెం రూరల్ : స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్, స్వచ్ఛ హీ సేవ -2024 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లోని కార్యదర్శులు ఏకో బ్రిక్స్ తయారీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీవోలు తమ మండలాల్లోని పంచాయతీలలో ఈనెల 30వ తేదీలోపు ఎక్కువ మొత్తంలో ఏకో బ్రిక్స్ తయారు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

మండల స్థాయిలో ఎక్కవ మొత్తంలో ఏకో బ్రిక్స్ తయారు చేసిన గ్రామపంచాయతీలను మండల స్థాయి టీమ్ సభ్యులైన ఎంపీడీఓ, ఎంపీవో, ఏపీవో, ఏపీఎంలు ధ్రువీకరించి ఫొటోలతో డీఆర్డీఏ కార్యాలయానికి సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కువ మొత్తంలో ఏకో బ్రిక్స్ తయారు చేసిన గ్రామపంచాయతీ కార్యదర్శులను జిల్లా స్థాయిలో అక్టోబర్ 1న సన్మానించనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story