పెదవాగులో జారిప‌డ్డ వ్య‌క్తి మృతదేహం లభ్యం

by velandi.Saikiran |

గుబ్బలమంగి ప్రవహిక పెదవాగులో జారి పడిన పెనుగొండ వెంకన్న (65) మృతదేహం లభ్యమైంది. ఆదివారం మధ్యాహ్నం బర్రెలను

పెదవాగులో జారిప‌డ్డ వ్య‌క్తి  మృతదేహం లభ్యం
X

దిశ, దుమ్ముగూడెం : దుమ్ముగూడెం మండలం చిన్న బండి రేవు గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటనలో గుబ్బలమంగి ప్రవహిక పెదవాగులో జారి పడిన పెనుగొండ వెంకన్న (65) మృతదేహం లభ్యమైంది. ఆదివారం మధ్యాహ్నం బర్రెలను మేపడానికి వాగు దారికి వెళ్లిన వెంకన్న ప్రమాదవశాత్తూ నీటిలో జారి పడ్డారు. ఇక‌ సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రెవెన్యూ సిబ్బంది అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటప్పయ్య ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగగా, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాగులో మునిగిన వెంకన్న మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Next Story