- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్రెగుట్ట ఆపరేషన్–2 ప్రారంభం
కర్రెగుట్ట ప్రాంతంలో “ఆపరేషన్–2” పేరుతో ప్రత్యేక దళాలు దాడులు, కూంబింగ్ చర్యలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.

*దేవ్ జీనే లక్ష్యం*
*గడువు ముగియడానికి ఇంకా 40 రోజులు మాత్రమే*
*పక్క సమాచారంతో ఆపరేషన్–2 మొదలు*
దిశ, చర్ల : కర్రెగుట్ట అడవి ప్రాంతంలో మరోసారి భద్రతా బలగాల కదలికలు వేగం పుంజుకున్నాయి. “ఆపరేషన్–2” పేరుతో ( Karregutta Naxal Operation ) ప్రత్యేక దళాలు దాడులు, కూంబింగ్ చర్యలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి లక్ష్యం దేవ్ జీ అని తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, గడువు ముగియడానికి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, పక్కా ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆపరేషన్ 2 ప్రారంభించినట్టు తెలుస్తోంది.
గత ఏడాది జరిగిన ఆపరేషన్ కర్రెగుట్టలో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ సారి అంతకు మించి ఉండే అవకాశం ఉందట. ఆపరేషన్ 2 భాగంగా అడవి మార్గాలు, కొండ చరియలు, గుట్టల పరిసర ప్రాంతాల్లో కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయి. స్థానిక గ్రామాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసినట్లు సమాచారం. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. ఆపరేషన్ 2 నేపథ్యంలో కర్రెగుట్టల పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కోసం ఈ సారి డీఆర్జీ బలగాలు దిగనున్నాయి.






