- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాద్రిలో భూవరాహ యజ్ఞం.. మంత్రి తుమ్మలకు ఆహ్వానం
భద్రాద్రిలో భూవరాహ యజ్ఞం కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డా. కృష్ణ చైతన్య స్వామి ఆహ్వానం పలికారు.

దిశ, భద్రాచలం: కల్ప వృక్ష నారసింహస్వామి వారి దివ్య సన్నిధిలో నృసింహ ఉపాసకులు డా. కృష్ణ చైతన్య స్వామి వారి ఆధ్వర్యంలో 32 దివ్య క్షేత్రాల నుండి తెచ్చిన మట్టికి 32 రోజుల కాలం ప్రత్యేక పూజలు చేసి, జూన్ 25నుండి 27వరకు మూడు రోజుల పాటు భూ వరాహ యజ్ఞాన్ని నిర్వహించి, ఆ మృత్తికాప్రసాదాన్ని రైతులకు అందించనున్నారు. ఇంతటి మహత్తర కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డా. కృష్ణ చైతన్య స్వామి ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఆదివారం మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా చైతన్య స్వామి మాట్లాడుతూ.. రైతు బాగుంటే దేశం బాగుంటుందని గత పది సంవత్సరాలుగా ఏరువాక పౌర్ణమి నాడు రైతన్నలను సన్మానించి వారికి మృత్తికాప్రసాదాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ మట్టి ప్రసాదాన్ని పంట పొలాలలో చల్లడం ద్వారా సమృద్ధిగా పంటలు పండుతాయని అన్నారు. భూవరాహ యజ్ఞంలో ప్రతి ఒక్క రైతు పాల్గొని స్వామివారి దివ్య సన్నిధిలో ఇచ్చే మృతిక ప్రసాదాన్ని స్వీకరించి తమ తమ పంట పొలాలలో జల్లుకొని సిరుల పంటలు పండించుకుని రైతన్నలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. లక్ష మంది రైతులకు ఆ మృత్తిగా ప్రసాదాన్ని అందించనున్నామని అన్నారు.






