- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రగిరి.. ఇల ‘వైకుంఠ’పురి
భద్రాచలంలో ఆద్యంతం కన్నుల పండువగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.

దిశ, భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అద్యయనోత్సవాలలో భాగంగా మంగళవారం సర్వఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన ఉత్తరద్వార దర్శనంతో భక్తులు పులకించిపోయారు. ఉత్తరద్వారంలో గరుడవాహనంపై రామయ్య... గజ వాహనంపై సీతమ్మ... హనుమద్ వాహనంపై లక్ష్మణ స్వామి వారిని దర్శించి భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. స్వామి వారు సాక్షాత్తు వైకుంఠం నుంచి భువికి వచ్చి సాక్షాత్కరించినట్లుగా అనుభూతి కలిగింది.
సరిగ్గా తెల్లవారు జామున 5గంటలకు తెల్లవారుజామున భక్తుల జయజయధ్వానాలు మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ రామయ్య సీతా లక్ష్మణ సమేతంగా తెల్లని మేఘాలవలే అలుముకున్న ధూప మంజరలు... మధ్య నుంచి భక్తులకు దర్శనమివ్వండంతో ఆ స్వామి వారి దర్శనం సాక్షాత్ వైకుంఠాన్ని తలపించింది. ఆరు గంటలకు ఆస్థాన హరిదాసులు కోదండపాణి అడుగో... అంటూ గానం చేస్తుండగా సపరివారంగా భద్రాద్రి రాముడు తిరువీధికి బయలుదేరాడు. స్వామి వారికి భక్తులు మంగళనీరాజనాలు పలికారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
ఉత్తరద్వారంలో గరుడవాహనంపై రామయ్య... గజ వాహనంపై సీతమ్మ... హనుమద్ వాహనంపై లక్ష్మణ స్వామి వారిని దర్శించి భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. స్వామి వారు సాక్షాత్తు వైకుంఠం నుంచి భువికి వచ్చి సాక్షాత్కరించినట్లుగా అనుభూతికి లోనయ్యారు. తెల్లవారుజామున భక్తుల జయజయధ్వానాలు మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ రామయ్య సీతా లక్ష్మణ సమేతంగా తెల్లని మేఘాలవలే అలుముకున్న ధూప మంజరలు... మధ్య నుంచి భక్తులకు దర్శనమివ్వండంతో ఆ స్వామి వారి దర్శనం సాక్షాత్ వైకుంఠాన్ని తలపించింది.
భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో డిసెంబర్ 20వ తేది నుండి జరుగుతున్న శ్రీవైకుంఠ ఏకాదశి అద్యయనోత్సవాలలో భాగంగా మంగళవారం సర్వఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన ఉత్తరద్వార దర్శనంతో భక్తులు పులకించిపోయారు. అర్థరాత్రి దాటిన తర్వాత వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా భక్తరామదాసు పేరిట స్వామి వారికి ప్రత్యేక అభిషేకం జరిగింది. ఈ సేవను రెవెన్యూ శాఖాధికారులు నిర్వహించారు. భక్తరామదాసు తహాసీల్దార్ ఉద్యోగం చేయడంతో అయన రెవెన్యూ శాఖకు చెందిన వారుగా భావించి వారి సేవను నిర్వహంచడం భద్రాచలం రామాలయంలో అనాదిగా వస్తున్న ఆచారం. అభిషేకం అయిన తర్వాత లఘు అరాధన జరిగి మళ్లీ విశేషంగా తిరుమంజనం నిర్వహించారు.
ఆ తర్వాత ధనుర్మాసానుసారంగా తిరుప్పావై సేవా కాలం, శాత్తుమొర అయిన తర్వాత భద్రాద్రి రాముడు ధనుర్బాణాలను అలంకారాలుగా ధరించి, రాజఠీవితో గరుడ వాహనాలంకృతుడవగా...ప్రత్యేకంగా అలంకరించబడిన ఉత్తరద్వారం లోపల సీతారామ లక్ష్మణ స్వాములను అర్చకులు వేంచేపుజేశారు. ఉత్తర ద్వారం బయట అశేష భక్త జనవాహిని ఉత్తరద్వార దర్శనానికి తపిస్తుండగా వారిని వీనులవిందు కలిగించేలా భక్త రంజని కార్యక్రమం భక్తరామదాసు కీర్తనలతో సాగింది. తర్వాత ఆస్థాన పండితులు ఆ ప్రశాంత పవిత్ర వాతావరణంలో వైకుంఠ ఏకాదశి వైభవాన్ని గురించి ఉపన్యసించారు. సరిగ్గా తెల్లవారు జామున 5గంటలకు మంగళవాయిద్యములు మోగుతుండగా, వేదఘోష సాగుతుండగా, ఘణ ఘణ గంటల ధ్వనుల మధ్య ఉత్తర ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. శ్రీస్వామి వారు సీతాలక్ష్మణ సమేతులై భక్తులకు సాక్షాత్కరించారు. 108 వత్తుల హరతులతో స్వామి వారికి మంగళాశాసనంతో ఉత్తరద్వార దర్శన సేవ సుసంపన్నం అయింది.
ఈ వైభవం భద్రాద్రిలో తప్ప మరెక్కడా ఉండదనడం అతిశయోక్తికాదు. సరిగ్గా 6 గంటలకు ఆస్థాన హరిదాసులు కోదండపాణి అడుగో... అంటూ గానం చేస్తుండగా సపరివారంగా భద్రాద్రి రాముడు తిరువీధికి బయలుదేరాడు. శ్రీస్వామి వారికి భక్తులు మంగళనీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తుల శ్రీరామ.. జయరామ.. ద్వానాల నడుమ అత్యంత వైభవంగా సాగింది. మంగళవారం రాత్రి నుంచి రాపత్తు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాపత్తు ఉత్సవాలు తొలి రోజు శ్రీరామ రక్షా మండపం డీఎస్పీ బంగ్లా లో నిర్వహించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వార దర్శనం తిలకించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, పీఓ రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్, ఆలయ ఈఓ దామోదర్ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.






