- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాద్రి వాసికి టెక్సాస్ యూనివర్సిటీ డాక్టరేట్
లయన్స్ క్లబ్ అఫ్ భద్రాచలం, గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో బుధవారం జీయర్ మఠంలో ఘనంగా సన్మానించారు.

దిశ, భద్రాచలం: లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సంస్థల కీలక బాధ్యులు, గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ చైర్మన్ యేగి సూర్యనారాయణకు డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ టెక్సాస్ యు.ఎస్ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అఫ్ భద్రాచలం, గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో బుధవారం జీయర్ మఠంలో ఘనంగా సన్మానించారు. దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రజలకు యేగి సూర్యనారాయణ ఎన్నో విశేష సేవలు అందిస్తున్నారని, వారికి డాక్టరేట్ రావడం భద్రాచలం పట్టణానికే చాలా గర్వకారణం అని పలువురు వక్తలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పి. కమలా రాజశేఖర్, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టే లలిత, ప్రముఖ సంఘ సేవకులు గాదె మాధవరెడ్డి,శ్రీరామా క్లబ్ అధ్యక్షులు చల్లగుళ్ళ నాగేశ్వరరావు, కురిచేటి శ్రీనివాస్, డాక్టర్ గోళ్ళ భూపతి రావు, పల్లింటి దేశప్ప, పరిమి సోమశేఖర్, జీయర్ మఠం అధ్యక్షులు జి. వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.






