జోన్–IV పోలీస్ డ్యూటీ మీట్‌లో భద్రాద్రి పోలీసులకు 12 పతకాలు

by Kodari Anjali |

జోన్–IV పోలీస్ డ్యూటీ మీట్–2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతిభ చాటుతూ మొత్తం 12 పతకాలు కైవసం చేసుకున్నారు.

జోన్–IV పోలీస్ డ్యూటీ మీట్‌లో భద్రాద్రి పోలీసులకు 12 పతకాలు
X

దిశ, కొత్తగూడెం: జోన్–IV పోలీస్ డ్యూటీ మీట్–2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతిభ చాటుతూ మొత్తం 12 పతకాలు కైవసం చేసుకున్నారు. ఇందులో 3 స్వర్ణ, 7 రజత, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. కొత్తగూడెం–I టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. కరుణాకర్ రెండు స్వర్ణ, ఒక రజత, ఒక కాంస్య పతకం సాధించగా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎస్‌కే నాగుల్‌మీరా నార్కోటిక్ డాగ్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. అశ్వారావుపేట సీఐ పి. నాగరాజు రెడ్డి, ఇల్లందు ఎస్‌ఐ కె. ఉమా, ఐటీ కోర్ పీసీ కె. నరేష్, చెర్ల పీసీ ఎస్. అయ్యప్ప, ఏఆర్ పీసీ కె. మహేష్ తమ తమ విభాగాల్లో రజత పతకాలు సాధించారు. బూర్గంపాడు డబ్ల్యూపీసీ బి. పావని ఒక రజత, ఒక కాంస్య పతకం దక్కించుకున్నారు. పతక విజేతలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Next Story