ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి

by velandi.Saikiran |

ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాల వైపు సాగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు

ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
X

దిశ, చర్ల: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాల వైపు సాగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం చర్ల మండలంలోని పెద్ద మిడిసిలేరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పదొవ తరగతి నుండే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కష్టపడి చదివే ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటారన్నారు. నిరుద్యోగులైన యువతకు సైతం జీవనోపాధి పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయని సహజ వనరులతో కుటీర పరిశ్రమలాంటివి పెట్టుకొవచ్చని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నచ్చిన రంగం ద్వారా ఉపాధి పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అశోక్,ఎంఈఓ సమ్మయ్య, అగ్రికల్చర్ ఏడి తాతారావు,డాక్టర్ సోమరాజు దొర,గ్రామ సర్పంచ్ యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story