భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి

by Ratna Kumari |

ఉగాది, రంజాన్, ఆదివారం వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో భద్రాద్రి పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు.

భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి
X

దిశ, భద్రాచలం : ఉగాది, రంజాన్, ఆదివారం వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో భద్రాద్రి పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఒకవైపు బ్రహ్మోత్సవాలు జరుగుతుండటం, మరోవైపు రంజాన్, ఆదివారం సెలవు రోజులు కావడంతో భక్తుల రద్ది పెరిగి స్వామివారి దర్శనం కొరకు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. భక్తులందరికి శీఘ్ర‌ దర్శనం అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలు పార్కింగ్ కు కూడా స్థలం లేకపోవడంతో వాహనాలను దూరంగా పార్కింగ్ చేసి నడిచి భక్తులు ఆలయం చేరుకుంటున్నారు. అందరికి ప్రసాదం అందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం కూడా భక్తుల తాకిడి ఇలాగే ఉండే అవకాశం ఉంది.

Next Story