- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామయ్య సాక్షిగా భారీ మోసం.. మంత్రి ఇలాఖాలో రెవెన్యూ అధికారుల లీలలు
భద్రాచలం రెవెన్యూ అధికారులు సాక్షాత్ రెవెన్యూ మంత్రి ఇలాఖాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

దిశ, భద్రాచలం: భద్రాచలం రెవెన్యూ అధికారులు సాక్షాత్ రెవెన్యూ మంత్రి ఇలాఖాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. భద్రాచలం రామాలయం మాడవీధుల అభివృద్ధి కోసం భూసేకరణ చేపట్టి, భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం చెల్లించే పరిహారం విషయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాగే భద్రాచలంలో ఓ వ్యక్తి తన స్థలం మాడ వీధుల అభివృద్ధిలో పోతుందని ఆ భూమిని సర్వే చేయాలని ఆర్డీఓ, తహసీల్దార్‌లకు విన్నవించి, తన దగ్గర ఉన్న పత్రాలను చూపించాడు. మాడవీధుల అభివృద్ధి కోసం వాడుకుంటే అందరికీ ఇచ్చినట్లు పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా పెడచెవిన పెడుతున్నారు. ఆ స్థలానికి పక్కా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా.. అధికారులు పరిహారం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడిని అధికారులు మోసం చేసి, వేరే వ్యక్తి పేరుపై పరిహారం మంజూరు చేయించి, తమ జేబుల్లో వేసుకున్నారా..? అనే ఆరోపణలు వస్తున్నాయి. - దిశ, భద్రాచలం
రెవెన్యూ అధికారులు తలచుకుంటే ఏదైనా చేయొచ్చు అని నిరూపించారు.. భద్రాచలం రెవెన్యూ అధికారులు. సాక్షాత్ రెవెన్యూ మంత్రి ఇలాఖాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. వివరాలలోకి వెళ్తే... భద్రాచలం రామాలయం మాడవీధుల అభివృద్ధి కోసం 2013, 2025లో రెండు విడతలు భూసేకరణ చేపట్టారు. రామాలయం సమీపంలో చిట్టిమోజు బ్రహ్మంకు చెందిన 4-1-1/1 నెంబర్ గల ఇల్లు ఉంది. ఈ ఇంటికి పడమర వైపు 63 గజాల స్థలం ఉంది. దీనిని మొదటి నుంచి వారు నడిచే దారిగా ఉపయోగిస్తుండటంతో, ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణం చేపట్టలేదు. ఈ స్థలం 1950లో రిజిస్ట్రేషన్ అయింది. తన స్థలం కూడా మాడవీధుల అభివృద్ధిలో పోతుందని, తనకు కూడా పరిహారం ఇవ్వాలని బ్రహ్మం 2013లోనే అధికారులకు విన్నవించాడు. కాగా బ్రహ్మం స్థలానికి ఆనుకుని ఉన్న చెక్క సుభాష్ చంద్ర బోస్ అనే వ్యక్తి పరిహారం చాలదంటూ కోర్టుకు వెళ్లడంతో, బోస్ ఇల్లు సర్వే చేసినప్పుడు మీ స్థలం కూడా సర్వే చేస్తామని అధికారులు బ్రహ్మంకు తెలిపారు. బోస్ సమస్య పరిష్కారం కాకపోవడంతో 2025 లో రెండవసారి భూసేకరణలో ఎట్టకేలకు తన స్థలం ఇవ్వడానికి బోస్ అంగీకరించాడు. కానీ భూసేకరణకు రెవెన్యూ అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో బ్రహ్మం పేరు లేకపోవడంతో మళ్ళీ అధికారులను ఆశ్రయించాడు. తన భూమిని కూడా సర్వే చేయాలని కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌లకు విన్నవించి, తన దగ్గర ఉన్న పత్రాలను చూపించాడు. అయినా అధికారులు బ్రహ్మం భూమిని సర్వే చేయలేదు.
కలెక్టర్ ఆదేశాలు ధిక్కరించిన అప్పటి ఆర్డీఓ
తనకు అన్యాయం జరిగిందని బ్రహ్మం కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను వేడుకోవడంతో, వెంటనే బ్రహ్మం సమస్య పరిష్కరించాలని కలెక్టర్ అప్పటి భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావును ఆదేశించారు. కానీ ఆర్డీఓ బ్రహ్మం ను పిలవడం గాని, అతని భూమి ఎక్కడ ఉందో చూపించమని అడగలేదు. దీంతో దిక్కుతోచక బ్రహ్మం హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అప్పుడు కూడా ఎటువంటి సర్వే నిర్వహించకుండా, ఆర్డీఓ ఆఫీస్‌లో కూర్చుని ఆ భూమిని రెవెన్యూ సేకరించడంలేదని కోర్టును తప్పుదోవ పట్టించారు. దీంతో బ్రహ్మం వేసిన రిట్ పిటిషన్ కోర్ట్ కొట్టి వేస్తూ, ఒకవేళ బ్రహ్మం భూమిని మాడవీధుల అభివృద్ధి కోసం వాడుకుంటే అందరికి ఇచ్చినట్లు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
పొజిషన్ నుండి బలవంతంగా ఖాళీ..
1950లో రిజిస్ట్రేషన్ అయిన తన భూమిలో బ్రహ్మం షాప్ నిర్వహించుకుంటుండగా... ఎటువంటి రికార్డులు పరిశీలించకుండా భద్రాచలం తహసీల్దార్ బలవంతంగా ఖాళీ చేయించాడు. మీరు సర్వేకి చలానా కట్టండి, మీకు సహకరిస్తాం అని పేర్కొన్న తహసీల్దార్.... చలానా కట్టి 50 రోజులు గడుస్తున్నా, ఇంతవరకూ సర్వే చేయలేదు. బ్రహ్మం దగ్గర ఉన్న డాక్యుమెంట్ పరిశీలించకుండా ఏ అధికారంతో బహ్మం స్థలం నుంచి అతనిని బలవంతంగా ఖాళీ చేయించారో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2013,2025 భూసేకరణ రికార్డులతో పాటు, బ్రహ్మం డాక్యుమెంట్ పరిశీలించకుండా బలవంతంగా ఖాళీ చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
పరిహారం నొక్కేసారా..?
బ్రహ్మం స్థలానికి పక్కా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా.. అధికారులు పరిహారం ఇవ్వకపోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుడైన బ్రహ్మాన్ని అధికారులు మోసం చేసి వేరే వ్యక్తి పేరు పై పరిహారం మంజూరు చేయించి, తమ జేబుల్లో వేసుకున్నారా..? అనే పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెవిన్యూ మంత్రి, కలెక్టర్ బ్రహ్మం కు న్యాయం చేయాలని






