- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరికి వరద ఉధృతి....@50 అడుగులు
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 3.30 గంటలకు గోదావరి 48 అడుగులకు

దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 3.30 గంటలకు గోదావరి 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు గోదావరి 50 అడుగులకు పెరిగి నిలకడగా ప్రవహిస్తుంది. 15 గంటలలో కేవలం రెండు అడుగులు మాత్రమే గోదావరి పెరిగి అదే స్థాయిలో ప్రవహిస్తుంది. 12,51,999 క్యూసెక్కుల వరదనీరు దిగువకు తరలి వెళ్ళింది. కాగా తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్ట్ లకు వరద ఉదృతి తగ్గింది.
తాలిపేరు ప్రాజెక్ట్ మూడు గేట్లు రెండు అడుగులు మేర ఎత్తి 4120 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదులుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ కు కేవలం 1500 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వచ్చి చేరింది. దీంతో ఇన్ఫ్లో ని బట్టి ప్రాజెక్ట్ కెపాసిటీ 406.50 మెయుంటైన్ చేస్తూ, అవసరం అయితే ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ కోరారు. భద్రాచలం వద్ద ప్రజలు, భక్తులు ఎవరూ గోదావరి వద్దకు వెళ్ళకూడదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.ప్రస్తుతం భద్రాచలంలో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఎగువ నున్న ప్రాజెక్ట్ల నుండి వచ్చే వరద నీరు తగ్గడంతో భద్రాద్రి వద్ద గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.






