డిప్యూటీ మేయర్ కి శుభాకాంక్షలు వెల్లువ

by Ratna Kumari |

కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన సిరవరపు లలితకుమారికి పార్టీలకతీతంగా పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

డిప్యూటీ మేయర్ కి  శుభాకాంక్షలు వెల్లువ
X

దిశ, పాల్వంచ టౌన్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన సిరవరపు లలితకుమారికి పార్టీలకతీతంగా పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పాల్వంచ పట్టణంలోని ఆమె స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జేవీఎస్.చౌదరి కలిసి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ మేయర్ గా ఒక మహిళకు అవకాశం కల్పించిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డిలకు పార్టీ అగ్రనాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఇచ్చిన డిప్యూటీ మేయర్ పదవికి లలితకుమారి న్యాయం చేస్తుందని, కొత్తగూడెం కార్పోరేషన్ అభివృద్ధికి పాటుపడుతుందని జేవీఎస్ చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story