కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో అలరించిన బతుకమ్మ వేడుకలు

by Elthuri vijay kumar |

జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల భాగంగా రెండవ రోజు సోమవారం అటుకుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో అలరించిన బతుకమ్మ వేడుకలు
X

కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో అలరించిన బతుకమ్మ వేడుకలు

సంబురంగా ఆడిపాడిన మహిళా ఉద్యోగులు

బతుకమ్మ పాటలతో మార్మోగిన కలెక్టరేట్ ప్రాంగణం

దిశ, కొత్తగూడెం: జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల భాగంగా రెండవ రోజు సోమవారం అటుకుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి స్ఫురించేలా బతుకమ్మల అలంకరణ, పాటలు, నృత్యాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి బతుకమ్మ పూజలో పాల్గొన్నారు.బతుకమ్మ పాటలతో ప్రాంగణం అంతా మార్మోగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ –“బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మీయత, సమైక్యతకు ప్రతీక. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదు, మహిళల సాధికారతకు, సమాజంలో వారి పాత్రకు ప్రతీక అని అన్నారు.

పూలతో తయారు చేసిన బతుకమ్మ ప్రకృతి సమతుల్యత, పర్యావరణ పరిరక్షణకు సూచిక అని, బతుకమ్మ పాటలు మన ఆత్మీయతను, పరంపరలను కొత్త తరాలకు చేరవేసే శక్తివంతమైన సాధనం అన్నారు.స్వయం సహాయక సంఘాల మహిళలు తమ కృషి, ప్రతిభతో కుటుంబ అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనలో కీలక పాత్ర పోషిస్తున్నారు అని, ఇలాంటి సాంప్రదాయ పండుగలు మహిళల ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో, పరస్పర ఐక్యతను బలపరచడంలో తోడ్పడతాయి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ దిశగా పలు చర్యలు చేపడుతోంది. అందులో బతుకమ్మ పండుగ ప్రత్యేక స్థానం కలిగి ఉంది అని, ప్రతీ ఒక్కరూ ఈ పండుగను పర్యావరణ హితంగా, సమైక్యతతో జరుపుకోవాలి అని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛతాహి సేవ - 2025 లో భాగంగా స్వచ్ఛోత్సవ్ - పక్షోత్సవాలు లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ లో అధికారులతో కలిసి కలెక్టర్ సెల్ఫీ ఫోటో దిగారు. ఈ వేడుకలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలతా లేనినా, జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీలత, మెప్మా పీడీ రాజేష్, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఐడిఓసి సిబ్బంది ఇతర శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story