గిరిజన మహిళల‌పై దాడి..!

by Ratna Kumari |

పోడు భూముల ట్రంచ్ తీయ‌డాన్ని అడ్డుకున్న గిరిజ‌న మ‌హిళ‌ల‌పై దాడి చేసి గాయ‌ప‌రిచిన ఫారెస్ట్ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా చేశారు.

గిరిజన మహిళల‌పై దాడి..!
X

దిశ, సత్తుపల్లి : పోడు భూముల ట్రంచ్ తీయ‌డాన్ని అడ్డుకున్న గిరిజ‌న మ‌హిళ‌ల‌పై దాడి చేసి గాయ‌ప‌రిచిన ఫారెస్ట్ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా చేశారు. ఈ సంద‌ర్భంగా సీపీఎంఎల్ మాస్ లైన్ డివిజ‌న్ కార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు అమ‌ర్ల పూడి శ‌ర‌త్ మాట్లాడుతూ స‌త్తుప‌ల్లి ప‌ట్ట‌ణం శివారులో గుడిపాడు వ‌ద్ద‌ గిరిజ‌న కుటుంబం సాగు చేసుకుంటుంది. ఈ విష‌యం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు పోడు భూముల వ‌ద్ద‌కు గిరిజ‌న మ‌హిళ‌ల‌పై దాడి చేశారు. గిరిజ‌నుల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని.. వెంట‌నే పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. పోడు భూముల్లో గిరిజనులు సాగు చేసుకుని పంటలు పండిస్తున్న పంటలను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ అండతో ఫారెస్ట్ అధికారులు పంటలు ధ్వంసం చేసిన‌ట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గిరిజ‌నుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని భావించామ‌ని.. కానీ గ‌త ప్ర‌భుత్వం మాదిరిగానే ఫారెస్ట్ అధికారులను పోడు భూముల మీదికి పంపించి ట్రంచ్ తీయ‌డం కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు. గిరిజ‌న మ‌హిళ‌ల‌పై దాడి చేసిన ఫారెస్ట్ అధికారుల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, పెండింగ్ లో ఉన్న పోడు భూములకు ప‌ట్టాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఈ ధ‌ర్నాలో దుర్గా, శ్రీను, చెల్లమ్మ ఆదినారాయణ, రజిని పాల్గొన్నారు.

Next Story