- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, భద్రాచలం : మావోయిస్టులు కిడ్నాప్ చేసిన అశోక్ పవార్‌కి (ప్రైవేట్ కంపెనీ ఇంజనీర్) ఎలాంటి హాని తలపెట్టకుండా క్షేమంగా విడిచిపెట్టాలని అతని భార్య సోనాలి పవార్ మీడియా ద్వారా మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. బీజాపూర్ జిల్లాలోని బెద్రే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వంతెన నిర్మాణ పనుల దగ్గర విధులు నిర్వహిస్తున్న అశోక్ పవార్‌తో పాటు మరోవ్యక్తిని శుక్రవారం మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఘటన తెలిసిందే. తన భర్త బస్తర్‌కు బతుకుదెరువు కోసం వచ్చాడని, కొందరు గ్రామస్తులు అతడిని పని ప్రదేశం నుంచి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మా కుటుంబ పోషణ కోసం నా భర్త బస్తర్‌కు పనికి వచ్చాడని తెలిపారు. తన భర్త వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించి, క్షేమంగా విడిచిపెట్టాలని వేడుకున్నారు.
Next Story






