అశ్వారావుపేట సీఎం రేవంత్...సభకు ఏర్పాట్లు

by velandi.Saikiran |

ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవానికి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

అశ్వారావుపేట సీఎం రేవంత్...సభకు ఏర్పాట్లు
X

దిశ, అశ్వారావుపేట: చండ్రుగొండ మండలంలోని బెండలపాడులో ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు సభాస్థలిని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇండ్లను పరిశీలించిన అనంతరం సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యంగా వర్షం పడిన సందర్భంలో ప్రజలు, విచ్చేసే అతిథులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

Next Story