- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాత్కాలిక ప్రాతిపదికన ప్రైమరీ ఇన్ స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ..
ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయుటకు దరఖాస్తులు చేసుకోవచ్చని మండల విద్యాశాఖ అధికారి జయరాజ్ తెలిపారు.

దిశ, కారేపల్లి: మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయుటకు దరఖాస్తులు చేసుకోవచ్చని మండల విద్యాశాఖ అధికారి జయరాజ్ తెలిపారు. మండల పరిధిలోని టేకులగూడెం విశ్వనాథపల్లి పేరుపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేయవలసి ఉంటుందన్నారు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని విద్యార్హతలు ప్రీ ప్రైమరి ఇన్‌స్ట్రక్టర్ ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత.. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ లేదా ప్రైమరీ టీచింగ్ సంబంధిత శిక్షణ/కోర్సు పూర్తి చేసి ఉండాలి. అన్నారు. అభ్యర్థులకనీస వయస్సు: 18 సంవత్సరాలుగరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు ఉండవచ్చు అన్నారు. గౌరవ వేతనంప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్: 8,000/-ప్రీ-ప్రైమరీ ఆయా పోస్ట్ 7 వ తరగతి విద్యార్హత గౌరవ వేతనం 6000 ఉంటుందన్నారు. అభ్యర్థుల ఎంపిక విధానం మెరిట్ ప్రకారం జరుగుతుందని తెలిపారు. వీటికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జూన్ 8, 9 వ తేదీలతో ముగుస్తుందన్నారు. మండల స్థాయి మెరిట్ జాబితా ఈనెల 10వ తేదీన ప్రకటించబడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆమోదం 11వ తేదీన జరుగుతుందని ఎంపికైన అభ్యర్థుల జాబితా జూన్ 11వ తేదీన డీఈఓ కార్యాలయంలో ప్రకటించబడుతుందని తెలిపారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ కోరారు.






