వైరా బీఆర్ఎస్‌కు మరో షాక్.. మరికొన్ని గంటల్లో పెను రాజకీయ మార్పులు..?

by Disha Web Desk 12 |
వైరా బీఆర్ఎస్‌కు మరో షాక్.. మరికొన్ని గంటల్లో పెను రాజకీయ మార్పులు..?
X

దిశ, వైరా : వైరా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ‌కి మరికొద్ది గంటల్లో మరో షాక్ తగలనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు పొంగులేటి వర్గంలో చేరారు. పొంగులేటి వర్గంలో చేరిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఇటీవల బీఆర్ఎస్ నాయకులు ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే వైరా పట్టణానికి చెందిన మరి కొంతమంది నేతలు మంగళవారం సాయంత్రం లోపు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సోమవారం పొంగులేటి వర్గీయులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో పొంగులేటి వర్గం భవిష్యత్తుపై ఉన్న నీలి నీడలు తొలగి పోయినట్లు అయింది. గతంలో పొంగులేటి వర్గంలోకి వెళ్లేందుకు ముందు.. వెనుకాడిన చాలామంది నేతలు ప్రస్తుతం క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం వైరా పట్టణానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి: 'బీఆర్ఎస్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు'


Next Story

Most Viewed