- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amit Shah : అమిత్ షా సభ మళ్లీ వాయిదా
ఖమ్మం జిల్లా కేంద్రం లో ఈ నెల 29 న జరగాల్సిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ రెండో సారి కూడా వాయిదా పడినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు.

దిశ ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లా కేంద్రం లో ఈ నెల 29 న జరగాల్సిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ రెండో సారి కూడా వాయిదా పడినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు. గత నెల 15 న జరగాల్సిన సభ అన్ని ఏర్పాట్లు చేశాక ఒక రోజు ముందు గుజరాత్, రాజస్థాన్ లో తుఫాన్ రావడం తో ప్రధాని ఆదేశాల మేరకు అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లడంతో సభ వాయిదా పడింది. మళ్లీ తిరిగి
ఈనెల 29వ తేదీన ఖమ్మం నగరంలో సభ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు బిజీ బిజీ కావడం, తెలంగాణ లో గత వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీ బహిరంగ సభ వాయిదా వేయడం జరిగిందని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభ మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా లో బలం తక్కువ గా ఉన్న బీజేపీ అగ్ర నేతల బహిరంగ సభలతో అయినా కొంత ఉనికి చాటుకుంటుంది అనుకుంటే వరుసగా బీజేపీ అగ్రనేతల సభలు వాయిదా పడటం తో బీజేపీ శ్రేణులు కొంతమంది అసంతృప్తి కి గురవుతున్నారు. మూడవ సారి అయినా సభ విజయవంతం అవుతుందో లేదో చూడాలి.






